Panchangam

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:
President Message

తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో - మొట్ట మొదటి తెలుగు సంఘం

కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు నా నమస్కారం..!!

మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, కళలను, విలువలను పరిరక్షించడం తో పాటు, సామజిక భాద్యత, సామజిక సేవ, సామజిక దృక్పధం, మన భావి తరాలకు అందిస్తూ, కొత్త తరమును ప్రోత్సహిస్తూ, వాలంటీరింగ్ అవకాశాలను కల్పిస్తూ, వాటిలో పాల్గొనే విధంగా ఒక వేదికను ఇస్తూ, గ్రేటర్ చికాగో ప్రాంతంలో బలమైన తెలుగు కమ్యూనిటీని ఏర్పర్చాలనేదే మన తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో యొక్క ముఖ్య లక్ష్యం..!!

ఈ లక్ష్యంతో ముందుకు వెళ్తూ 53వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది మన టి.ఏ.జి.సి. ఇందుకు గాను ఎంతోమంది వ్యవస్థాపకులు, సభ్యులు, కార్యవర్గ సభ్యులు, స్వచ్చంద సేవకులు, దాతలు మరియు పోషకులు, నిర్విరామన కృషి చేసి, టి.ఏ.జి.సి ని, ఒక బలమైన సంస్థగా నిలిపారు. వారందరికీ ఎన్ని కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పినా తక్కువే..

వారి సహాయ సహకారాలు మనకు ఎప్పటికి ఇలాగె ఉండాలని ఆశిస్తూ.. ఈ సంవత్సరానికి ప్రెసిడెంట్ గా నన్ను నియమించిన కార్యవర్గసభ్యులకు, హృదయపూర్వక ధన్యవాదాలు..!!

గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షస్తూ.. మన భావి తరాలకు సామజిక సేవ యొక్క విలువలను నేర్పించుకుంటూ.. సరికొత్త ఉత్తేజాన్ని ఈ కొత్త సంవత్సరంలోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మనం చేసే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు, విద్యా సదస్సులకు, సామజిక సేవలకు మీ యొక్క సమయాన్ని మరియు నైఫుణ్యాలని అందించి, వాటిని ప్రోత్సహించి, మరింత విన్నూతనంగా చేసి.. వసుదైక కుటుంబంగా ఉండాలని ఆశిస్తూ.. తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో కుటుంబసభ్యులకు, దాతలకు, శ్రేయోభిలాషులకు...ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు..!!

"దేశ భాషలందు తెలుగు లెస్స", అని కీర్తి గడించిన తెలుగు ఖ్యాతి ని అంతర్జాతీయ వేదిక పై పరిచయం చేయ సత్సంకల్పించిన మాకు, ఈ చిరు ప్రయత్నం తో, " వసుధైక కుటుంబం" అను ఉత్కృష్ఠ ఆశయాన్ని చేరుకోగలిగే మనోధైర్యమును మరియు ఉత్సాహాన్ని అందించ ప్రార్ధన!!

లోకాః సమస్తాః సుఖినో భవంతు !!
జై హింద్ !! జై తెలుగు తల్లి !!
గాడ్ బ్లెస్స్ అమెరికా !!

ఇట్లు,

సంతోష్ కొండూరి,

టి ఏ జి సి అధ్యక్షుడు - 2024

Sponsors

Media Partners

© 2024 Telugu Association of Greater Chicago. All rights reserved.

Design & developed by Arjunweb